ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు..

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న పదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన హైదరాబాద్ లోని మధురా నగర్ లో ఉన్న కార్మిక నగర్ లో చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో మహమ్మద్ అజాన్ అనే పదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. బాలుడికి ప్రాణాపాయమేమి లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని.. పలు మార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు స్థానికులు.