రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయన ఘటన మరవకముందే మరో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌లోకి చొరబనడిన వీధి కుక్క విద్యార్థిపై దాడి చేసింది. ఈ దాడిలో 7వ తరగతి చదువుతున్న సుమంత్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
అంబర్ పేటలో ఆదివారం ఓ చిన్నారిని కుక్కలు కరిచి చంపడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీధి కుక్కల నివారణపై దృష్టి సారిస్తామని చెప్పారు.