కాశీబుగ్గలో స్ట్రీట్​ ఫైటింగ్​ కలకలం

కాశీబుగ్గ, వెలుగు : కాశీబుగ్గ  సర్కిల్​లో  ఆదివారం  స్ర్టీట్​ ఫైటింగ్​ కలకలం రేపింది.  కాశీబుగ్గ పెద్ద మోరీ వద్ద దాదాపు పదిమంది ఆకతాయిలు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవపడ్డారు.  ఇతేజార్​గంజ్​ సీఐ శివకుమార్​  తెలిపిన వివరాల ప్రకారం..  కాశీబుగ్గలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగిందని సోషల్​ మీడియా ద్వారా తెలిసింది.   దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు.  అయినా పోలీసులు రెండు గ్రూపులను పట్టుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు.   ఒక గ్రూపు దేశాయిపేట, మరో గ్రూపు కాశీబుగ్గకు చెందిన్నట్లుగా తెలిసిందని అన్నారు. 

 మద్యం, డ్రగ్స్​ మత్తులో!

మద్యం, డ్రగ్స్​ మత్తులో యువకులు నడి రోడ్డు పై ఫైటింగ్​ చేసినట్టు తెలుస్తోంది. రోడ్డు పై వెళ్తున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు, వరంగల్​, కరీమాబాద్​, మండి బజార్​, కాశీబుగ్గ, తెలంగాణ జంక్షన్​తో పాటు పలు ప్రాంతాల్లో  కొన్ని రోజులుగా డ్రగ్స్​, లిక్కర్​ మత్తులో కొందరు హల్​ చల్​ చేస్తున్నారు.   గతకొన్ని రోజులు వరుస ఘటనలు జరుగుతున్నా యి.  ఇప్పటికైనా పోలీసులు  నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.