- స్ర్టీట్ లైట్లు వెలగట్లే.. బల్దియా పట్టించుకోవట్లే!
- గ్రేటర్‌లో మెయిన్, కాలనీ రోడ్లపైనా ఇదే పరిస్థితి
- మెయింటెనెన్స్ పై బల్దియా అధికారుల నిర్లక్ష్యం
- రాత్రిపూట రోడ్లపై గుంతల్లో పడుతున్న వాహనదారులు
- చోరీలు జరిగినా లైటింగ్ లేక సీసీ కెమెరాలకు చిక్కట్లే
- ప్రతి ఏటా కోట్లలో ఖర్చు చేస్తున్నా మారని తీరు
“ఉప్పల్‌కు చెందిన ప్రశాంత్ హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో ఎంప్లాయ్. రెండురోజుల కిందట ఆఫీసులో లేటు అవడంతో అర్ధరాత్రి 12 గంటలకు బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. బంజారాహిల్స్‌రోడ్ నంబర్.12లో నిర్మాణంలో ఉన్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డుపై కిలోమీటరు మేర స్ట్రీట్‌లైట్లు వెలగడం లేదు. రోడ్డుపై చీకటిగా ఉండగా ఓ చోట మ్యాన్‌హోల్ రిపేర్ చేయగా కనిపించలేదు. అతడు దాన్ని తప్పించబోయి బైక్ అదుపు తప్పి కిందపడడంతో స్వల్పంగా గాయపడ్డాడు.’’
హైదరాబాద్, వెలుగు: సిటీలో స్ట్రీట్ లైట్లు, హై మాస్ట్ లైట్లుమెయిన్రోడ్లు, కాలనీలు, బస్తీల్లో ఇలా ఏ చోటా చాలా వరకు వెలగడం లేదు. సాయంత్రం ఆరుదాటితే ఆయా ప్రాంతాల్లో చీకటిగా ఉంటుంది. ప్రధాన జంక్షన్ల లోని హైమాస్ట్ లైట్లు కొన్ని నెలలుగా పని చేయడంలేదు. గ్రేటర్‌లో 2 నుంచి5 శాతం స్ట్రీట్‌లైట్లు మాత్రమే పని చేయడం లేదని అధికారులు చెబుతుండగా, పరిశీలిస్తే 30 శాతం వరకు లైట్లు వెలగడం లేదని తెలుస్తోంది. పర్యాటక ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి తదితర ఏరియాలపైనే ఫోకస్చేస్తున్న అధికారులు పబ్లిక్ తిరిగే ప్రాంతాలను పట్టించుకోవడంలేదు. స్ర్టీట్లైట్లు వెలగక చాలా చోట్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాలనీలు, బస్తీల్లో వీధిలైట్లు లేని ప్రాంతాలనే దొంగలు టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో చోరీ జరిగితే ఆ చిత్రాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించడం లేదు. గ్రేటర్‌లో కొంతకాలం కిందట రూ.217.12 కోట్లతో ఎల్ఈడీ లైట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వీటిని టెక్నికల్‌గా పర్యవేక్షిస్తున్న అధికారులు 98 శాతం వెలుగుతున్నాయని చెబుతున్నా ఆ పరిస్థితి కనబడడంలేదు.
రాత్రిపూట యాక్సిడెంట్లు
మియాపూర్, బాగ్‌లింగంపల్లి, సుచిత్ర, అబిడ్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, నాగోల్, నానల్‌నగర్, రేతిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గోల్కొండ, మల్లేపల్లి, నాంపల్లి ఇలా ప్రాంతాల్లోని మెయిన్‌రోడ్లు, కాలనీల్లో స్ర్టీట్లైట్లు సరిగా లేక, ఉన్నా వెలగకపోతుండగా స్థానికులు రాత్రిపూట ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. టొలీచౌకి నుంచి జూబ్లీహిల్స్వెళ్లే రూట్లో లైటింగ్లేకపోవడంతో పాటు రోడ్లు గుంతలుగా ఉండడం తో రాత్రిపూట యాక్సిండెంట్లు కూడా అవుతున్నాయి. ఎక్కడ చూసినా పరిస్థితి ఇలాగే ఉంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.