
హైదరాబాద్ సిటీ, వెలుగు : రవీంద్రభారతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మూడు నెలలుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత ఆ ప్రాంతం మొత్తం చీకటిగా మారుతోంది. రోజూ ఒకటి, రెండు మైనర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వాహనదారులు గాయపడ్డారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో రెండు బైకులు అదుపు తప్పాయి. వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సర్కిల్లో కొత్త స్ట్రీట్ లైట్లు బిగించాలని, చీకట్లు లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులను కోరినా స్పందన లేదని తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రోజంతా వీఐపీ వెహికల్స్మూవ్మెంట్ ఉంటోంది. ఇంతటి కీలకమైన సర్కిల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.