ఐస్ క్రీం అంటే చాలు కాలంతో సంబంధం లేకుండా చిన్నాచితకా ముసలీ ముతకా తింటారు. ఎండకాలం వచ్చిందంటే ఈ ఐస్ క్రీంలకు ఇంకా మస్తు గిరాకీ ఉంటుంది. గ్రామాల్లో వీధుల్లో, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీం తోపుడు బండ్లు కనిపిస్తాయి. అలాంటి ఐస్ క్రీంలో ఓ దుర్గార్ముడు వీర్యం కలిపి అమ్ముతున్నాడు. వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెక్కొండ మండలంలో రాజస్థాన్ కు చెందిన కాలురం కుర్బియా అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్ దగ్గర ఐస్ క్రీం తోపుడు బండి పెట్టుకుని అమ్ముతున్నాడు. అయితే హస్త ప్రయోగం చేస్తూ ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు.ఈ ఘటనను స్థానికులు ఎవరో వీడియో తీశారు. వీడియో వైరల్ కావడడంతో ఫుడ్ ఇన్ స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి అక్కడి ఐస్ క్రీంల శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు.