రూ.10కే KFC-స్టైల్ ఫ్రైడ్ చికెన్‌.. జోక్ కాదు నిజం

స్ట్రీట్ ఫుడ్.. ఈ మాట చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది. పానీ పూరీ, సమోసా, వడ పావ్, పిజ్జా, పాస్తా, బర్గర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మాటల్లో చెప్పలేని వెరైటీలు.. మాటలకందని రకాలతో స్ట్రీట్ వెండర్స్... కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఓ స్ట్రీట్ ఫుడ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగా కేఎఫ్సీ ఫుడ్ అంటే చాలా ఖరీదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ వీధి వ్యాపారి అమ్మే కేఎఫ్సీ తరహా ఫుడ్ అత్యంత చౌకగా లభిస్తోంది.

'థెరీల్‌హర్యుప్పల్' అనే ఇన్ స్టా పేజీ షేర్ చేసిన ఈ వీడియోలో.. ఓ వీధి వ్యాపారితో తాను సంభాషిస్తున్నట్టుగా ఉంది. వేయించిన చికెన్ తక్కువ ధర పలకడం ఒక జోక్ అని బ్లాగర్ వీధి వ్యాపారిని అడుగుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. దానికి వెండర్ స్పందిస్తూ, ("మజాక్ నహీ హై, బిల్కుల్ సచ్ హై, రూ.10మెయిన్ KFC చికెన్ మిల్తా హై") ఇది జోక్ కాదు, కేవలం 10 రూపాయలలో, మీకు KFC చికెన్ లభిస్తుంది అని చెప్పాడు. ఇంతలోనే అతను ఎముకలు లేని చికెన్ ముక్కలను మసాలా దినుసులలో కలపడం, బ్రెడ్ ముక్కలలో వేయడం ఈ వీడియోలో చూడవచ్చు.

దాంతో పాటు KFC అంటే 'కమ్రా ఫ్రైడ్ చికెన్' అని, వేయించిన చికెన్ చేయడానికి 100 శాతం చికెన్ బ్రెస్ట్ ముక్కలను ఉపయోగిస్తాడని వీధి వ్యాపారి వీడియోలో వివరించాడు. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇది ప్లేట్ కాదు పీస్‌కు రూ.10 అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది ఎలా లాభదాయకంగా ఉంది? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

https://www.instagram.com/reel/CrpoLu5rhsU/?utm_source=ig_embed&ig_rid=dbbfe1a6-182d-4360-b037-58ba21bf5152