కుమారి ఆంటీకో న్యాయం.. మాకో న్యాయమా?

కుమారి ఆంటీకో న్యాయం.. మాకో న్యాయమా?
  • నాలెడ్జ్​సిటీ రోడ్డులో స్ట్రీట్ వెండర్స్ ఆందోళన 
  • తమకూ న్యాయం చేయాలని డిమాండ్


మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్ నాలెడ్జ్​సిటీ రోడ్డులోని ఫుట్​పాత్​లపై వెలసిన ఫుడ్ స్టాల్స్​ను తొలగించడంతో స్ట్రీట్​వెండర్లు గురువారం ఆందోళనకు దిగారు. సోషల్​మీడియాలో ఫేమస్​అయిన కుమారి ఆంటీకో న్యాయం.. తమకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టీజీఐఐసీ, ట్రాఫిక్​పోలీసులు తమ స్టాల్స్​ను తొలగించారని మండిపడ్డారు. ఐటీసీ కోహినూర్​పక్కన ఉన్న నాలెడ్జ్​సిటీ రోడ్డులోని ఫుట్​పాత్ లపై కొంతకాలంగా ఫుడ్ స్టాల్స్​నడుస్తున్నాయి.

వీటిలోనే సోషల్​మీడియాలో ఫేమస్​అయిన కుమారి ఆంటీ ఫుడ్​స్టాల్​కూడా ఉంది. ఫుడ్​స్టాల్స్ కు వచ్చేవారి వెహికల్స్​కారణంగా రోజూ ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అక్కడికి దగ్గర్లోని ఖాళీ జాగాలోకి ఫుడ్​స్టాల్స్​ను తరలించేందుకు టీజీఐఐసీ, ట్రాఫిక్​ పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఆ ఖాళీ స్థలంలో ఉన్న 40 స్ట్రీట్​ఫుడ్​స్టాల్స్ ను పోలీసులు బుధవారం తొలగించారు. దీంతో ఆ షాపుల నిర్వాహకులు గురువారం ఆందోళనకు దిగారు. కుమారి ఆంటీకి మాదిరిగా తమకు కూడా న్యాయం చేయాలని సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. తమపై కక్షపూరితంగా వ్యవహరించడం కరెక్ట్​కాదని ఆవేదన వ్యక్తం చేశారు.