ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారుడి సత్తా

ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారుడి సత్తా

భద్రాచలం, వెలుగు: ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారుడు గోల్డ్ మెడల్ సాధించాడు. యూరప్​ఖండ దేశమైన మాల్టాలో బుధవారం జరిగిన పోటీల్లో జూనియర్స్ విభాగంలో బెంచ్​ప్రెస్​140 కిలోలు, స్క్వాట్స్ 280 కిలోలు, డెడ్​లిఫ్ట్ 242.5 కిలోలు, టోటల్‎గా​662.5 కిలోల బరువులు ఎత్తి భద్రాచలంలోని సిటీ స్టైల్​జిమ్‎కు చెందిన మోడెం వంశీ బంగారు పతకం గెలిచాడు. ఇతను ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలోని దినసరి కూలీ కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ. 

జాతీయ స్థాయిలో వంశీ పలు పతకాలు సాధించి ఇంటర్నేషనల్​పోటీలకు ఎంపికవగా.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా.. భద్రాచలానికి చెందిన ప్రముఖులు సాయమందించారు. అంతర్జాతీయ పవర్​లిఫ్టింగ్​పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.2.10 లక్షలను పవర్​లిఫ్టింగ్​ఆఫ్ ఇండియాకు చెల్లించాలి. ఇలా చెల్లించిన వంశీ  అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.