- కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌తో కలిసి దేశం పరువును హిండెన్‌బర్గ్ తీసిందని యూనియన్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఈ కంపెనీపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదానీ షేర్లు కృత్రిమంగా పెంచిన ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌కు, ఆమె భర్త దవళ్ బచ్‌కు వాటాలున్నాయని శనివారం హిండెన్‌బర్గ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ ఆరోపణలు నిరాధారమని ఈ దంపతులు ఇప్పటికే క్లారిఫై చేశారు. తమ ఆర్థిక పరిస్థితి తెరిచిన పుస్తకమని అన్నారు.
అదానీ గ్రూప్ కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని, పబ్లిక్‌ను మానిప్యులేట్ చేస్తోందని పేర్కొంది. గిరిరాజ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్‌ను తీవ్రంగా విమర్శించారు. హిండెన్‌బర్గ్ వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. కాగా, మాధవి పురి బచ్ రాజీనామా చేయాలని
ఆమెపై దర్యాప్తు జరిపేందుకు జేపీసీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు హిండెబర్గ్ లేటెస్ట్ రిపోర్ట్‌పై సెబీ, మాధవి పురి బచ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు యాడ్ చేయడానికి ఏం లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ సెక్రెటరీ అజయ్ సేత్ పేర్కొన్నారు.