
- ధన్నూర్బి, కౌఠ బిలో రూ.2.24 లక్షల మద్యం స్వాధీనం
బోథ్, వెలుగు: బోథ్ మండలంలో అక్రమంగా బెల్టు షాప్‌లు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎల్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆదేశాల మేరకు గురువారం కౌఠ బి, ధన్నూర్ బి గ్రామాల్లోని బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. కౌఠ బిలో బెల్టుషాప్ లో రూ.90 వేల మద్యం స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ధన్నూర్'బి'లో బెల్టుషాప్లో రూ.1.34 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు రత్నపురం సాయన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరితో పాటు ఈ రెండు గ్రామాల వీడీసీలకు చెందిన పలువురిపై, అందులో పనిచేసే వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీడీసీల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.