
అచ్చంపేట వెలుగు : నెంబర్ ప్లేట్ లేని వాహనాలు రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని అచ్చంపేట ఎస్సై రమేశ్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ఈరోజు అచ్చంపేట పట్టణంలోని సక్రమంగా నెంబర్ లు కనిపించని, నెంబర్ ప్లేట్లు లేని 10 వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు అచ్చంపేట ఎస్సై తెలిపారు.
ప్రతి ఒక్కరూ వాహనాలకు సక్రమంగా నెంబర్ ప్లేట్లు ఉండే విధంగా, వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపరాదన్నారు. హెల్మెట్ విధిగా ధరించాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనదారులు అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.