
రామాయంపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు చేపడుతామని రామాయంపేట సీఐ వెంకటేశ్ హెచ్చరించారు. గురువారం రామాయంపేట మండల విత్తన డీలర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన నియంత్రణ చట్టం 1983 లోబడి అందరూ వ్యాపారం చేయాలని సూచించారు. ప్రతి డీలర్ లైసెన్సు కలిగి ఉండాలని, అధీకృత విత్తన కంపెనీ ల నుండే విత్తనాలు తేవాలని, అవి తెచ్చేటప్పుడు ఇన్వాయిస్, ప్రిన్సిపల్ సర్టిఫికెట్ కలిగిఉండాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాలు అమ్మేటప్పుడు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలని, వాటిపై వారి సంతకాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ రంజిత్, ఏఓ రాజ్ నారాయణ ఉన్నారు.