ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు : ఆహార కమిషన్ చైర్మన్  గోలి శ్రీనివాసరెడ్డి 

ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు : ఆహార కమిషన్ చైర్మన్  గోలి శ్రీనివాసరెడ్డి 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లాలోని వెల్దండ మండలంలో అంగన్వాడీలు, వసతి గృహాలు, నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షిస్తూ పోషకాహార పంపిణీలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి రేషన్ దుకాణానికి బోర్డు, ఫిర్యాదుల పెట్టే, డీలర్ పేరు, ఫోన్ నెంబర్ వివరాలు ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాలలో ఆహారం మెనూ ప్రకారం లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలంగాణ ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగనేని శారద, జ్యోతి పాల్గొన్నారు.