
గూడూరు/ నర్సింహులపేట, వెలుగు: తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు బైక్ లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు సీఐ బాబూరావు, నర్సింహులపేట ఎస్సై సురేశ్హెచ్చరించారు. గురువారం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు నేషనల్ హైవేపై సీఐ ఎస్సై గిరిధర్ రెడ్డితో కలసి వాహన తనిఖీ చేపట్టారు. సరైన వాహన పత్రాలు లేని 20వేహికిల్స్ ను సీజ్చేశారు. నర్సింహులపేటలో స్కూల్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కొంత మంది ఆకతాయిను పట్టుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.