మ్యాన్​హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు

మ్యాన్​హోళ్లు తెరిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్, వెలుగు: మ్యాన్ హోళ్లను ఇష్టారీతిన తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాటర్​బోర్డు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్ల పక్కన, కూడళ్లలోని మ్యాన్ హోళ్ల పర్యవేక్షణకు సీవరేజ్​బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మూతలు ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా 155313కు కాల్​చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. బల్దియా సిబ్బందితో కలిసి వాననీటిని క్లియర్ చేస్తున్నామన్నారు.