నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

ఆర్మూర్, వెలుగు:  నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్​అగ్రికల్చర్ఆఫీసర్ హరికృష్ణ సీడ్​వ్యాపారులను హెచ్చరించారు. లో శుక్రవారం ఎవో హరికృష్ణ, తహసీల్దార్ గజానన్​, సీఐ రవికుమార్ స్టాఫ్​ తో కలిసి సీడ్ షాపులను తనిఖీ చేశారు.  స్టాక్, రిజిస్టర్లను పరిశీలించి, గోదాంలను చెక్​ చేశారు. నాణ్యమైన కంపెనీ విత్తనాలను అమ్మాలని సూచించారు. కొనుగోలు చేసిన వాటికి తప్పకుండా రశీదు ఇవ్వాలని చెప్పారు. 


ఎడపల్లి: నకిలీ విత్తనాల కట్టడికి ఏర్పాటు చేసిన స్పెషల్​టాస్క్​ఫోర్స్​టీం శుక్రవారం  మండల కేంద్రంలో పలు ఎరువుల షాపులను తనిఖీ చేశారు. ఈ టీంలో తహసీల్దార్ ధన్వాల్, ఎస్ఐ క్రిష్ణారెడ్డి,  వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్​ ఉన్నారు. ముగ్గురూ కలిసి విత్తనాలు, పురుగుమందుల స్టాక్ రిజిస్టర్లను చెక్​ చేశారు. డీలర్లు రైతులకు విత్తనాలు ఇచ్చేటప్పుడు తప్పకుండా రశీదు ఇవ్వాలని సూచించారు . కల్తీ విత్తనాలు అమ్మొద్దని ఎప్పటికప్పుడూ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు. లైసెన్స్ లేని దుకాణదారులు విత్తనాలు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని 
హెచ్చరించారు.