అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

వెంకటాపురం, వెలుగు : ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం తహసీల్దార్​ ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం వాడగూడెం గోదావరి పాయనుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం శివారు బెస్త గూడెం వెళ్లే రహదారిలో గోదావరి నది పాయ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని వచ్చిన సమాచారంతో దాడులు చేశామన్నారు. ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్​ కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు