తాగి బండ్లు నడిపితే కఠిన చర్యలు

పోయినేడు మొదటి 5 నెలల్లో 2,455 క్యాన్సిల్​​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: తాగి బండ్లు నడిపితే ఆర్టీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 4,300 లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు రద్దు చేశారు. పోయినేడు మొత్తం 6,950 లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు రద్దు చేయగా, మొదటి ఐదు నెలల్లో 2,455 లైసెన్స్‌‌‌‌‌‌‌‌లు రద్దు చేశారు. డ్రంకన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓవర్ లోడ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, ఓవర్ స్పీడ్ తదితర కారణాలతోనూ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్రంకన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌, ఓవర్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌, ఓవర్‌‌‌‌‌‌‌‌ లోడ్‌‌‌‌‌‌‌‌, గూడ్స్‌‌‌‌‌‌‌‌ వాహనాల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోవడం, డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఫోన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడడం, హెల్మెట్‌‌‌‌‌‌‌‌, సీట్‌‌‌‌‌‌‌‌ బెల్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోకపోవడం, రాంగ్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌, యాక్సిడెంట్లు తదితర విషయాల్లో నేరం అధికంగా ఉండటం, మళ్లీ మళ్లీ నేరం చేస్తే  లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్టీఏ అధికారులు నేరుగా లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తుండగా, మరికొన్ని సార్లు కోర్టు ఆదేశాలు, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ అధికారుల సూచన మేరకు రద్దు చేస్తున్నారు. 

 

12 పాయింట్లు దాటితే వేటే..

రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఇందుకోసం 2018లో 12 పాయింట్ల విధానం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక్కో నేరానికి ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఐదు పాయింట్ల వరకు పెట్టారు. డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌కు 3 నుంచి -5 పాయింట్లు, ఓవర్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌కు 3 పాయింట్లు.. ఇలా నేరాన్ని బట్టి పాయింట్లను తీసుకొచ్చారు. మొత్తం 12 పాయింట్లు దాటితే 3 నెలల నుంచి ఏడాది పాటు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేస్తారు. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్ల పాటు, మూడోసారి అయితే మూడేళ్ల పాటు రద్దు చేస్తున్నారు.