పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లను చేశామన్నారు. ఎన్నికల్లో భద్రత నిమిత్తం 73 వేల 414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలు,164 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ ఫోర్స్, 7000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రత విధుల్లో ఉంటారని చెప్పారు.
అక్రమ మద్యం రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు డీజీపీ రవిగుప్తా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖిల్లో 184 కోట్ల విలువైన నగదు మద్యం డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కు చేరేంతవరకు ఈ కంట్రో