
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో బెట్టింగ్ లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని, యాప్ లలో బెట్టింగ్ కి పాల్పడినా , ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, వాటిని ప్రోత్సాహించినా కఠిన శిక్షలు తీసుకుంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ , గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.