ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ప్రభుత్వం అందిస్తున్న గొర్ల కోసం డీడీ కట్టిన గొల్ల కురుమలకు వెంటనే గొర్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో యాదవులు ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కుమ్రం భీం చౌక్‌లో రాస్తా రోకో నిర్వహించి అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా చేశారు. జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. గొల్ల కురుమలను లక్షాధికారులను చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్.. గొర్ల పంపిణీ చేపట్టి ఏండ్లు గడుస్తున్నా పథకం పూర్తి చేయలేదన్నారు.
జిల్లాలో 3,750 యూనిట్లకు లబ్ధిదారుల నుంచి డీడీలు కట్టించి ఏడాది గడుస్తున్న గొర్ల పంపిణీ పూర్తికాలేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అణగారిన ప్రజాల హక్కుల సాధన కమిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, గొర్ల రాజు యాదవ్, పాయల్ శరత్, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.