ఖమ్మం టౌన్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ.26 వేల వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ALSO READ : అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి
అంగన్వాడీలకు సౌలతులు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్, ఐసీడీఎస్ ఆఫీసర్ సుమకు వినతిపత్రం అందజేశారు. పోటు ప్రసాద్, ఎర్ర శ్రీకాంత్, వై విక్రం, తుమ్మ విష్ణువర్ధన్, కల్యాణం వెంకటేశ్వరరావు, సింగు నరసింహారావు, సీహెచ్ సీతామహాలక్ష్మి, బి కోటేశ్వరి, కె సుధ, రాధ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల ఇంటి ఎదుట ఆందోళన..
పాల్వంచ: అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్వంచలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటే శ్వరరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వనమా ఇంటి ఎదుట బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యకర్తలు వనమా ఇంటి లోపలికి వెళ్లకుండా సీఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించా రు.
అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చి మంత్రి సత్యవతి రాథోడ్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరాటి ప్రసాద్, గోనె మణి, విజయ, పద్మ, భా రతి, మాధవి, రూప, సునీత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
భద్రాచలం: సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడీ కార్మికులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించి, ధర్నా చేశారు. పది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.