తెలంగాణ RTCలో సమ్మె సైరన్..ఆరోజునుంచి బస్సులు బంద్

తెలంగాణ RTCలో సమ్మె సైరన్..ఆరోజునుంచి బస్సులు బంద్

హైదరాబాద్: TGSRTC లో సమ్మె సైరన్ మోగింది. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె దిగుతామని నోటీసు ఇచ్చారు. మే 6 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు జేఏసీ నేతలు నోటీసులిచ్చారు. మే 7న మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళతామని తెలిపింది. ఇవాళ్టి వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అందలేదు.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఆర్టీసీ లాభాల బాట అంటూ ఇప్పటి వరకు పీఆర్సీ ఊసే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు.వెంటనే పీఆర్సీ ప్రకటించాలి...జీతాలు ఇవ్వాలి, ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ యాజమాన్యంతో నడిపించాలని డిమాండ్ చేశారు. 

ఇప్పటికే 40వేల మంది కార్మికులు రోడ్డు పడ్డారు..ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులంతా మే 7వ తేదీన ఉధృతంగా సమ్మె బాట పట్టనున్నట్లు జేఏసీ నేతల ప్రకటించారు.