జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె నేటితో నాలుగో రోజుకి చేరింది. వారికి ఎంప్లాయ్స్ యూనియన్ ప్రెసిడెంట్ఉదరి గోపాల్ సంఘీభావం ప్రకటించారు. అనంతరం సరూర్నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లే ఔట్సోర్సింగ్ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు విధుల్ని బహిష్కరిస్తే హైదరాబాద్ చెత్త కుప్పగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన మాట తప్పారని సమ్మె చేస్తున్న కార్మికులను బీఆర్ఎస్ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలపై సీఎం కక్ష సాధింపు ధోరణి సరకాదని అన్నారు. వారిని పర్మినెంట్ చేస్తున్నామని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపబోయేదని లేదని స్పష్టం చేశారు.