70వ రోజుకు చేరిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల దీక్షలు

బోధన్, వెలుగు: బోధన్ లోని శక్కర్ నగర్ లో నిజాం షుగర్​ఫ్యాక్టరీ కార్మికులు చేపడుతున్న దీక్షలు శుక్రవారం 70వ రోజుకు చేరాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్​రెడ్డి దీక్షలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా,  అధికారపార్టీ నేతలు కనీసం వచ్చి పలకరించిన పాపన పోలేదన్నారు.

పాత బకాయిలు చెల్లించాలని, ఫ్యాక్టరీని పున:ప్రారంభించాలని కోరుతున్న పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణా ధ్యక్షుడు కొలిపాక బాలరాజు, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, లీడర్లు గుంత గంగాధర్, గంగుల శ్రీకాంత్  పాల్గొన్నారు.