బోనమెత్తిన సమగ్ర శిక్షా ఉద్యోగులు

బోనమెత్తిన సమగ్ర శిక్షా ఉద్యోగులు

బషీర్ బాగ్, వెలుగు: సిటీలో సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. 13వ రోజైన ఆదివారం బషీర్ బాగ్ లోని డీఈఓ ఆఫీస్​నుంచి మహిళలు బోనాలు ఎత్తుకొని ర్యాలీగా నాంపల్లిలోని బంగారు మైసమ్మ అమ్మవారికి సమర్పించారు.

తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సరిత, కోశాధికారి శ్రీవాణి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం 19 వేల మంది సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్​చేశారు. తమ బాధను అర్థం చేసుకొని, సీఎం రేవంత్​రెడ్డి క్రిస్మస్ పండుగ లోపు తమకు తీపికబురు చెప్పాలని కోరారు.