హన్మకొండ జిల్లాలో తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వట్లేదని కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట ధర్నా

భీమదేవరపల్లి, వెలుగు : అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ కానిస్టేబుల్‌‌‌‌ ఇంటి ఎదుట మహిళ ఆందోళనకు దిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌‌‌‌ గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, ముస్తఫాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన కడారి శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం... తన తండ్రి చల్లూరి ఐలయ్య 2022 జూన్‌‌‌‌లో గట్ల నర్సింగాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన, ఏఆర్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ జుట్టు ప్రతాప్‌‌‌‌కు రూ. 2.20 లక్షలు అప్పుగా ఇచ్చారు.

ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. తర్వాత తన తండ్రి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని శ్రీలత పలుమార్పు కానిస్టేబుల్‌‌‌‌ను కోరినా అతడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం గట్ల నర్సింగాపూర్‌‌‌‌ గ్రామానికి వచ్చి కానిస్టేబుట్‌‌‌‌ ఇంటి ఎదుట బైఠాయించింది. డబ్బులు ఇచ్చేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టడంతో కానిస్టేబుల్‌‌‌‌ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లి పోయారు.