సింగరేణిలో అద్దె వెహికల్స్‌‌‌‌ ఓనర్ల సమ్మె

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో అద్దె వెహికల్స్‌‌‌‌ నడుపుతున్న భూనిర్వాసిత ఓనర్లు గురువారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. రామగుండం ఏరియాలోని ఆర్జీ 1, 2, 3  డివిజన్లలో మైన్లు, ఓసీపీలు, డిపార్ట్‌‌‌‌మెంట్లు కలిపి మొత్తం 412 వెహికల్స్‌‌ బంద్​ అయ్యాయి. భూనిర్వాసిత ఓనర్లు మాట్లాడుతూ సింగరేణికి తమ భూమి, ఇండ్లను అప్పగించడంతో ఉపాధి కోసం సంస్థలో అద్దెకు వెహికల్స్‌‌‌‌ నడుపుకునే అవకాశం ఇచ్చిందన్నారు.

 అయితే వివిధ కండీషన్లు పెడుతుండడంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ఉన్న స్లాబ్‌‌‌‌ రేట్ 2023లో కూడా కంటిన్యూ చేస్తున్నారని, పెరిగిన డీజిల్‌‌‌‌ రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచాలని డిమాండ్​చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.