ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. మీరు కూడా కొట్టి కొట్టి చంపుతారు.. !

ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. మీరు కూడా కొట్టి కొట్టి చంపుతారు.. !

పైన ఫొటో చూశారు.. ఐదుగురు ఉన్నారు కదా.. వీళ్లేమీ చదువు సంధ్య లేని ఔలాగాళ్లు కాదు.. నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్.. నర్సింగ్ అంటే మామూలు వృత్తికాదు.. ఎంతో బాధ్యతతో.. ఓపికతో చేయాల్సిన పని.. అలాంటి చదువు చదువుతూ.. కాలేజీలో వీళ్లు చేసిన ర్యాగింగ్ చూసి దేశం మొత్తం షాక్ అయ్యింది. ఇంత క్రూరమైన ర్యాగింగ్ ఎప్పుడూ.. ఎక్కడా జరగలేదని ముక్కున వేలేసుకుంటున్నారు.. ఈ ఘటన తెలిసిన స్టూడెంట్స్ అయితే.. ర్యాగింగ్ ఇంత దారుణంగా కూడా చేస్తారా.. అసలు వీళ్లు స్టూడెంట్సా లేక సైకోలా అనే అనుమానం వస్తుంది. కేరళ రాష్ట్రం కొట్టాయంలోని నర్సింగ్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా.. చర్చనీయాంశం అయ్యింది.

  • కేరళ రాష్ట్రం కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ అది.
  • మూడో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్ శామ్యూల్ జాన్సన్, ఎన్.ఎస్.జీవ, కెపీ రాహుల్ రాజ్, సి.రిజిల్ జిత్, వివేక్ ఎన్పి వీళ్లు కాలేజీలో జూనియర్స్ ను ర్యాగింగ్ చేస్తున్నారు.
  • ఈ ఐదుగురు సీనియర్ స్టూడెంట్స్.. జూనియర్లను కాలేజీలోనే రోజూ ర్యాగింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
  • జూనియర్స్ ప్రైవేట్ పార్ట్స్.. దానికి తాడు కట్టటం.. ఆ తాడుకు డంబెల్స్ వేలాడదీయటం అనేది అత్యంత కిరాతమైన ర్యాగింగ్.
  • చేతులు, కాళ్లపై బ్లేడుతో కోయటం.. ఆ గాయాలపై కారం పూయటం.. నొప్పితో వాళ్లు అరుస్తుంటే వీడియోలు తీయటం వీళ్లు సైకో మనస్తత్వానికి పరాకాష్ఠ.
  • బ్లేడ్ తో కాళ్లు, చేతులపై గాయాలు చేయటమే కాకుండా.. వాటిపై డెటాల్ పోయటం.. దిక్సూచీలతో గాయాల కొలతలు తీసుకోవటం ఇలాంటి క్రూరమైన ర్యాగింగ్ చేసేవాళ్లు.
  • ర్యాగింగ్ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆరు నెలలుగా బెదిరిస్తూ వస్తున్నారు.
  • సీనియర్స్ హింసను భరించలేని జూనియర్స్ ఇంట్లో వాళ్లకు చెప్పటంతో.. వాళ్లు కాలేజీ ఏరియాలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. 
  • కాలేజీ యాజమాన్యం సైతం విచారణ చేసి నిజం అని తేలటంతో.. కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
  • సీనియర్స్ ఐదుగురు స్టూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేశారు.. నాన్ బెయిల్ బుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ ఘటన తెలిసిన తర్వాత ర్యాగింగ్ ఇంత దుర్మార్గంగా.. ఇంతా సైకోగా ఉంటుందా.. ఇలాంటి స్టూడెంట్స్ నర్సింగ్ చదివే అర్హతే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ర్యాగింగ్ చేసినోళ్లకు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలని.. అప్పుడే వాళ్లకు ఆ బాధ, నొప్పి తెలిసొస్తుందంటూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.