జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

జపాన్ లో భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

జపాన్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. 2024, ఆగస్ట్ 8వ తేదీ ఉదయం.. దక్షిణ జపాన్ లోని మియాజాకి కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

నిచినాన్ నగరంలోని సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో.. 20 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అలలు మీటర్ ఎత్తులో ఎగసిపడతాయని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. ఎవరూ సముద్రం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. సముద్ర తీరంలో.. నదులు, సరస్సుల సమీపంలో ఉండే ప్రజలు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది జపాన్ ప్రభుత్వం.