నైరుతి ఇండోనేషియాలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0 నమోదైంది. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా సులవేసి ద్వీపంలోని అక్రమ బంగారు గనిలో కొండచరియలు విరిగిపడ్డాయి. 35 మంది గనిలో చిక్కుకుపోయారు. వారికోసం రెస్క్యూ టీంలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 400 మంది సిబ్బంది హెలికాప్టర్‌తో గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. దట్టమైన పొగ, బురద కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలకు గాలింపు చర్యలు ఇబ్బందిగా మారింది.