రిలేషన్షిప్ లోకి అడుగు పెట్టడమే కాదు, తమ బంధం బలంగా, రొమాంటిక్ గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం పార్ట్ నర్ చేసే చిన్న చిన్న పనులను కూడా గమనించడం, అభినందించడం, పరస్పరం సహకరించుకోవడం వంటివి ఇక్కడ ప్రయారిటీ అంశాలుగా ఉంటాయని, డేటింగ్ కల్చర్లో దీనినే 'గ్రీన్ ఫ్లాగ్స్' అంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అవేమిటో చూద్దాం.
ఆత్మ విశ్వాసం
బంధం బలంగా ఉంటూ.. రొమాంటిక్ రిలేషన్షిప్ సవ్యంగా కొనసాగాలంటే.. పార్ట్నర్ లో ఆత్మ విశ్వాసం కూడా నిండుగా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ కాన్సిడెంట్ ఉన్నవాళ్లు తమను ఎవరైనా తమను జడ్జ్ చేస్తారేమోనని అస్సలు భయ పడరని నిపుణులు చెప్తున్నారు. పైగా తమ ఫిలింగ్స్ ను స్వేచ్ఛగా బయట పెడతారు. అదీగాక ఆత్మవిశ్వాసం కలిగిన పార్టనర్ వల్ల తాము సురక్షితంగా ఉంటామని చాలామంది భావిస్తారట. అందుకే ఈ జనరేషన్ వాళ్లు తమ భాగస్వామిలో సెల్ప్ కాన్సిడెంట్ ఉండాలని కోరుకుం టున్నారు.
ఫీలింగ్స్ క్యాచ్ చేయడం
ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కానీ ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవిం చడం, ఫీలింగ్స్ క్యాచ్ చేయడం వంటివి తమ పార్ట్నర్ లో ఉండాలని ఈరోజుల్లో చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని భాగస్వామిగా పొందాలన్న ఆరాటం నేటి యువతీ యువకుల్లో ప్రధానంగా కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. చెప్పేది శ్రద్ధగా విని అర్ధం చేసుకోవడం, అవతలి నుంచి కూడా అదే విధమైన శ్రద్ధ కనబర్చడం వంటి ప్రవర్తన బంధాన్ని బలోపేతం చేస్తుందని, డేటింగ్ పార్టనర్లో అలాంటి లక్షణాలనే నేటి యువత కోరుకుంటోం ధని రిలేషన్ షిప్ నిపుణులు చెప్తున్నారు.
ఒత్తిడి నుంచి ఉపశమనం వరకు
ఫీలింగ్స్ క్యాచ్ చేయగలిగే వ్యక్తికోసం ఆరాటం పరస్పర సహకారం, భావోద్వేగ మద్దతు ముఖ్యమని నిపుణులు అంటున్నారు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మాటలు, ప్రవర్తన దానినుంచి బయట పడేసేలా ఉండాలి. కానీ మరింత ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు. రిలేషన్ షిప్ లో ఇది చాలా ముఖ్యమని నేటి యువత భావిస్తోంది. తాము ఎంపిక చేసుకోబోయే భాగస్వామిలో కూడా ఆ లక్షణాలు ఉండాలని కోరుకుంటోందని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తిగత సమస్య అయినప్పటికీ పార్ట్నర్ పట్టించుకోగలగాలి. మనసు తెలుసుకొని మసలు కోవాలి. సలహాలు సూచనలు ఇవ్వడం, కలిసి పరిష్కారం వెతకడం వంటివి చేయాలి. ఇది స్ట్రాంగ్ రిలేషన్ షిప్ కి ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు.
గుడ్ కమ్యూనికేషన్
రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకానీ ఒకరి గురించి ఏమీ తెలియకుండా, పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తిని తమ ఆసక్తులకు అనుగుణంగా జడ్జ్ చేయడం ఎవరికీ నచ్చడు. ఇది అర్థం చేసుకోవడంతోపాటు పార్ట్ నర్తో ప్రేమగా, గౌరవంగా మాట్లాడటం... భావాలను నిజాయితీగా చెప్పడం, అభిప్రాయ భేదాలు తలెత్తితే కలిసి మాట్లాడుకొని పరిష్కరిం చుకోవడం వంటివిన్నీ రిలేషన్ షిప్ లో గుడ్ కమ్యూనికేషన్ కిందికి వస్తాయి. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
బాధల్లో, భావోద్వేగాల్లో తోడుగా..
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కష్టాలు, నష్టాలు, బాధలు, భావోద్వేగాలు వస్తుంటాయి. అలాగని అవి శాశ్వతం కాదు. సంతోషాలు, సరదాలు వంటి అంశాల్లో భాగస్వామికి ఎలా సపోర్టుగా ఉంటారో, బాధలో ఉన్నప్పుడు, భావోద్యేగాలకు లోనైనప్పుడు కూడా అలాగే ఉండాలని నేటి యువత కోరుకుం టున్నట్లు రిలేషన్ షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు చెప్తున్నారు.ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని పార్ట్నర్ పొందాలనే ఆసక్తిని నేటి డేటింగ్ కల్చర్లో ముఖ్యమైన 'గ్రీన్ ఫ్లాగ్స్ గా పేర్కొంటున్నారు