తైవాన్లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు

తైవాన్ రాజధాని తైపీలో  భారీ భూకంపం సంభవించింది.  రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదయ్యింది.  తైవాన్ లోని హువాలియోన్ టౌన్ కు దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో 35 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు (0000 GMT) వచ్చింది. జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

భూకంప దాటికి పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి. ఓ ఐదంతస్తుల భవనం 45 డిగ్రీల  యాంగిల్ లో  ఒరిగిపోయింది.  తైపీలో చాలా బిల్డింగులు కూప్పకూలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.   భూకంపం వల్ల వచ్చిన సునామీల అలలు తైవాన్ తీరంలోని హువాలియోన్ పట్టణాన్ని తాకాయి. 

మరో వైపు  ఒకినావా ద్వీపంలో  3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అంచనా వేసింది. మియాకో, మేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది.  1999 తర్వాత జపాన్ లో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదేనని చెబుతున్నారు.