తొర్రూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు కొరవి సుధాకరాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూర్ పట్టణంలోని హైస్కూల్లో టీచర్స్ ఎమ్మెల్సీ లో భాగంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న డీఏ లను విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.
ఇప్పటివరకు కొత్త పీఆర్సీ విధివిధానాలు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ప్రోగ్రాంలో హై స్కూల్ హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఎస్‌టీయూ నాయకులు తాండాల చంద్రప్రకాశ్, చంద్రమౌళి, ప్రభాకర్ రావు, పోలోజు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.