- ఢిల్లీలో12వ క్లాస్ స్టూడెంట్ అరెస్టు.. పరీక్షలు రాయడం ఇష్టం లేక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ పంపిన ఓ స్టూడెంట్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఢిల్లీలోని 23 స్కూళ్లకు బూటకపు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.
దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ మెయిల్స్ చేసినట్టు గుర్తించారు. గురువారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పరీక్షలు రాయడం ఇష్టం లేకనే వాటిని ఆపాలనే ఉద్దేశంతోనే బెదిరింపులకు పాల్పడినట్టు స్టూడెంట్ తెలిపాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రతిసారి ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలకు కాకుండా వేర్వేరు స్కూళ్లకు బెదిరింపు ఈ మెయిల్స్ పంపించాడు.