వేధింపులతో స్టూడెంట్ ​ఆత్మహత్యాయత్నం

గూడూరు: సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని ఆవేదనతో జూనియర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మహబూబాబాద్  జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగింది. కొత్తగూడ మండలం పోనుగొండ్ల కు చెందిన ఆరో తరగతి చదువుతున్న ఈసం రుత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గత కొంతకాలంగా పదో తరగతి విద్యార్థులు తనను హాస్టల్లో వేధిస్తున్నారని తెలిపాడు.  ఇవాళ తెల్లవారుజామున హాస్టల్లో విద్యార్థులకు ఎలర్జీ కోసం ఉపయోగించే మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  గమనించిన హాస్టల్ వార్డెన్ వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . మెరుగైన చికిత్స కోసం విద్యార్థిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి, వివరాలు సేకరిస్తున్నారు.