
జీవితం అంటే అవగాహన లేని వయసులో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ పాసైతేనే జీవితంలో పాస్ అయినట్లు కాదనే అవగాహన లేక చిన్న తనంలోనే జీవితాన్ని చాలిస్తున్నారు విద్యార్థులు. మార్కులు, ర్యాంకుల వేటలో కార్పోరేట్ కాలేజీల ప్రచారంలో.. సమాజంలో టెన్త్, ఇంటర్ పాస్ అవ్వడం అంటే పరువుతోకూడిన పనిలా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.
బుధవారం (ఏప్రిల్ 23) మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మున్సిపాలిటీ లో ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని నింపింది. గోదావరి రోడ్ లో పందిరి భూమ్మన్న కూతురు పందిరి అశ్విత (16) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం (ఏప్రిల్ 23) ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. లక్సట్టిపేట్ లో ని ఓ ప్రవేట్ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విత ఇంగ్లీష్ లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాప్తానికి గురైన అశ్విత తన ఇంట్లో ఈ రోజు (మంగళవారం) తండ్రి బయటికి వెళ్ళింది చూసి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
►ALSO READ | ప్రేమించి పెండ్లి చేసుకుని జల్సాలు.. ప్రశ్నించినందుకు భార్య, అత్తపై కత్తితో దాడి.. మియాపూర్లో ఘటన
కుటుంబ సభ్యులు చూసే సరికి అప్పటికే ఆమె మరణించడంతో టుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపానికి గురై అశ్విత ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ ఐ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.