ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్

ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్

నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిన్న విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్ కి చెందిన జాను ఇంటర్ చదువుతోంది. కాగా.. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన జాను.. రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడింది. ప్లాట్ ఫాం మీదున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.