
అల్వాల్, వెలుగు: టెన్త్పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కొడుకు సంజయ్ కుమార్ (15) వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉంటూ పరీక్షలు రాసినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు ముగిసిన తర్వాత వెస్ట్ వెంకటాపురంలోని ఇంటికి వచ్చాడు.
మరో రెండు రోజుల్లో రిజల్ట్వస్తాయనగా, టెన్షన్‌తో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులకు ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.