హైదరాబాద్లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫార్మసీ చదువుతూ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాన్ని సూసైడ్ నోట్ లో రాసి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవడం కుత్భుల్లాపూర్ లో సంచలనంగా మారింది.

కుత్భుల్లాపూర్ మండల్ పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి, వెన్నెలగడ్డలోని ఓ ప్రైవేట్ హస్టల్ లో జరిగింది ఈ ఘట. విద్యార్థిని ఉన్నట్లుండి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది భయాందోళకు గురయ్యారు. 

సోమవారం (మార్చి 10) హాస్టల్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ప్రియాంక(26) అనే విద్యార్థిని. ప్రియాంక ఫార్మసీ చదువుతూ హాస్టల్ లో ఉంటోంది.  హాస్టల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రేమించిన రవికుమార్(28) అనే వ్యక్తి  పెళ్లి చేసుకోవడం లేదని, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది ప్రియాంక. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.