
కల్వకుర్తి, వెలుగు: దైవదర్శనానికి వెళ్లిన ఓ స్టూడెంట్ నీటి గుండంలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా వెల్దండ మండలం గుండాల అంబ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం జరిగింది. వెల్దండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన ఉమేశ్ (17) కల్వకుర్తి పరిధిలోని జయప్రకాశ్‌నగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
బుధవారం శివరాత్రి కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి వెల్దండ మండలం గుండాలలోని అంబ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు దేవాలయంలోని గుండంలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు గుండంలో ఎంత వెదికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మోటార్ సాయంతో నీటిని బయటికి తోడుతున్నారు.