తిరువనంతపురం: న్యూ ఇయర్ వేళ కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తోన్న స్కూల్ బస్సు సిని రేంజ్లో పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మరణించగా.. మరో 14 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. 2025, జనవరి 1వ తేదీ బుధవారం సాయంత్రం కేరళ కన్నూర్‌లోని వలక్కై మార్గంలో చిన్మయ్ స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.
విద్యార్థులతో వెళ్తోన్న ఈ బస్సు సినిమా రేంజ్లో రోడ్డుపై పల్టీలు కొడుతూ బోల్తా పడటంతో అందులోని ఓ విద్యార్థి స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్థి నేధ్యా ఎస్ రాజేష్‌గా గుర్తించారు. స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థులను సాయంత్రం స్కూల్ నుండి సాయంత్రం ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందన్నారు.
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఘటన స్థలంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ రోడ్డు నుండి ఈ రోడ్డు పైకి స్కూల్ బస్సు పల్టీలు కొడుతోన్న దృశ్యాలు వీడియోలో క్లారిటీగా కనిపిస్తున్నాయి.
STORY | Student killed, 18 injured as school bus overturns in Kerala's Kannur
— Press Trust of India (@PTI_News) January 1, 2025
READ: https://t.co/Nywqm53hQ6
VIDEO:
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/haVqljIAR6