మానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..  

 మానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..  

తొర్రూరు‌‌, వెలుగు : వైద్యం వికటించి విద్యార్థి మృతి చెందిన ఘట న మహబూబాబాద్ జిల్లాలో జరిగిం ది. బాధిత కుటుంబసభ్యులు తెలిపి న ప్రకారం.. తొర్రూరు మండలం కంటయపా లెం గ్రామానికి చెందిన దాసరోజు సిద్ధార్థ(16)  స్థానిక జడ్పీహెచ్ఎస్ లో  9వ తర గతి చదువుతున్నాడు. ఇటీవల అతడు జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు తొర్రూరులోని బాలాజీ నర్సింగ్ హోమ్‌‌కు తీసుకెళ్లారు.

చికిత్సపొందుతూ సిద్ధార్థ బుధవారం చనిపోయాడు. డాక్టర్లు ఎక్కువ డోసు మెడిసిన్ ఇవ్వడంతోనే  తమ కొడుకు చనిపోయాడని తల్లి ఆరోపించారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందడంతో తొర్రూరు సీఐ గణేష్ వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. విద్యార్థి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.