విద్యా దినోత్సవంలో విషాదం.. ర్యాలీలో ఆరో తరగతి విద్యార్థి మృతి

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది.  ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో  ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి ఆరోతరగతి బాలుడు ఇనుగాల ధనుష్(10) మృతిచెందాడు.  ర్యాలీ తీస్తుండగా కిరాణ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా  వీధి కుక్కలు వెంటపడటంతో తప్పించుకునే ప్రయత్నంలో ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు.

 5 వతరగతి పూర్తి చేసుకుని ఆరో తరగతిలోకి అడుగుపెట్టాడు ధనుష్. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు ప్రాణం తీసిందని ఆరోపిస్తున్నారు.  పాఠశాల నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.