నీ గుండె బతకాలిరా సామీ.. అందులో ప్రియా, పూజ, నమితా, హరిత, రూప..

నీ గుండె బతకాలిరా సామీ..  అందులో  ప్రియా, పూజ, నమితా, హరిత, రూప..

సోషల్ మీడియా కారణంగా పిల్లల్లో క్రియేటివిటీ తన్నుకొచ్చేస్తోంది. ఓ స్కూల్ పిల్లోడు హార్ట్ డయాగ్రామ్ వేసి, దాని ఫంక్షన్స్ రాయమంటే.. తన హార్ట్ లో ఎవరున్నారో రాసుకొచ్చాడు. మెస్సేజింగ్ యాప్స్ వచ్చాక స్కూల్  కు వెళ్లే స్టూడెంట్స్ బాగా చెడిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా స్నేహాలు, ఏజ్ కి మించిన మాటలు. సోషల్ మీడియాలో మనకు నచ్చిన వీడియో వస్తే కాసేపు నవ్వుకొని వదిలేస్తాము. కానీ.. వీడి ఆ కాన్సె్ప్ట్  ఎక్కడ కనెక్ట్ అయ్యిందో మరి తన హృదయంలో ఐదుగురు అమ్మాయిలు ఉ్ననారని ఏకంగా ఎగ్జామ్ క్వశ్చన్  పేపర్ లోనే రాశాడు.

స్కూల్ ఎగ్జామ్ పేపర్ లో హృదయం పటం గీసి, దాని విధులు రాయండి అని ప్రశ్నకు మనోడు తన హృదయంలో ఎవరెవరు ఉన్నారో.. వాళ్లు వివరాలు ఏంటో అని మొత్తం రాశాడు. హరిత, రూప, ప్రియా, పూజ, నమిత లు తన హార్ట్ లో ఉన్నారని, వాళ్లతో సోషల్ మీడియాలో చాట్ చేస్తానని ఆన్సర్ షీట్ లో రాశాడు. అందులో ఒకరు అతని నైబర్, మరోకరు క్లాస్ మెట్ అని, ఇంకోకరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు.  ఇన్ని రాసిన ఆ పిల్లోలు ప్రశ్న పత్రం పై అతని పేరు రాయలే.. టీచర్ పేపర్ వ్యాల్యూష్ టైంలో ఆ పేపర్ చదివి కంగుతిన్నది. ఈ ఆన్సర్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు వెర్రీ ఫన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్ కు సోషల్ మీడియా యూజర్లు వాళ్ల క్రియేటివిటీకి తగ్గట్లు రెస్పాండ్ అవుతున్నారు.