హాస్టల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి పడి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి

  •     గొంతు, చేతులపై కోసుకున్న గాయాలు
  •     రూమ్‌‌‌‌‌‌‌‌లో దొరికిన లెటర్‌‌‌‌‌‌‌‌
  •     హత్య చేసి ఆత్మహత్య అంటున్నారని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆందోళన

హసన్‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు:  కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి పడి ఓ ఇంటర్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ చనిపోయింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని భీమారం శివానీ జూనియర్​ కాలేజీలో శుక్రవారం జరిగింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల కవిత -ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ దంపతుల పెద్ద కూతురు సాహిత్య(16) భీమారంలోని శివానీ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఇంటర్‌‌‌‌‌‌‌‌ బైపీసీ ఫస్ట్​ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. ఇటీవల ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ కావడంతో నాలుగు పరీక్షలు రాసింది. శుక్రవారం తెల్లవారుజామున హాస్టల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ ఫోర్త్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ నుంచి పడిపోయింది. గమనించిన హాస్టల్​సిబ్బంది వెంటనే వరంగల్‌‌‌‌‌‌‌‌ ఎంజీఎంకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

రూమ్‌‌‌‌‌‌‌‌లో సూసైడ్‌‌‌‌‌‌‌‌ లెటర్‌‌‌‌‌‌‌‌.. ఒంటిపై గాయాలు

సాహిత్యను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లిన అనంతరం హాస్టల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఆమె పేరెంట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేయూ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.  సాహిత్య ఉంటున్న రూమ్‌‌‌‌‌‌‌‌లో రెండు రోజుల కింద రాసిన ఓ లెటర్‌‌‌‌‌‌‌‌ కనిపించింది. ‘మూడు నెలలుగా నాకు మంచిగా అనిపించడం లేదు, అందుకే ఎగ్జామ్స్​ కూడా సరిగా రాయలేకపోయా’ అని లెటర్‌‌‌‌‌‌‌‌లో రాసి ఉంది. మరో వైపు సాహిత్య గొంతు, చేతి మణికట్టు ప్రాంతంలో కోసినట్లుగా గాయాలు కనిపించాయి.

హత్య చేశారని ఆందోళన

సాహిత్య మృతి విషయం తెలుసుకున్న పేరెంట్స్, బంధువులు శుక్రవారం ఉదయం కాలేజీ వద్దకు చేరుకొని ఆందోళనకి దిగారు. కేయూ విద్యార్థి సంఘాల నేతలు కూడా వారికి మద్దతు తెలిపారు. సాహిత్య మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. తమ కూతురు మెరిట్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ అని ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదన్నారు. సాహిత్య బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పైనుంచి పడి చనిపోతే కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సమారు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న హనుమకొండ ఏసీపీ దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేయూ పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. సాహిత్య తండ్రి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు కేయూ పోలీసులు చెప్పారు.