కూల్​డ్రింక్​ అనుకొని గడ్డి మందు తాగిండు

కూల్​డ్రింక్​ అనుకొని గడ్డి మందు తాగిండు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా స్టూడెంట్ మృతి
  • అంబులెన్స్ రిపేర్ అయిందని వెళ్లని 108 సిబ్బంది  
  • సంగారెడ్డి జిల్లా గాజుల్ పాడులో ఘటన

కంగ్టి, వెలుగు: కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగి ఓ పాఠశాల విద్యార్థి చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కంగ్టి మండలం చాప్టా(కే)గ్రామానికి చెందిన వీరబాయి, మారుతీ దంపతుల కొడుకు కృష్ణ(14) అమ్మమ్మ ఊరైన అదే మండలంలోని గాజుల్ పాడు లో ఉంటూ కంగ్టిలోని స్కూల్ లో  లో 9వ తరగతి చదువుతున్నాడు.  ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగాడు. సృహ తప్పి కింద పడిపోవడంతో వెంటనే బాలుడి మేనమామ బైక్ పై కంగ్టి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఖేడ్ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో 108 అంబులెన్స్ కు కాల్ చేశారు.​

రిపేర్ ఉందని రాలేమని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.  దీంతో కంగ్టి ఆస్పత్రి నుంచి ఖేడ్ ఆస్పత్రికి  బైక్ పై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కృష్ణ చనిపోయాడు. సమయానికి అంబులెన్స్ వస్తే తన బిడ్డ బతికుండేవాడని.. తన బిడ్డ చావుకు 108 సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లి వీరబాయి ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్​ చేశారు.