స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య.. టీచర్ వేధింపులే కారణం.. !

స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య.. టీచర్ వేధింపులే కారణం.. !

హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ విద్యార్ధి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ( ఫిబ్రవరి 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భరత్ నగర్ లో ఉన్న సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే విద్యార్ధి.. స్కూల్ బిల్డింగ్ టెర్రస్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.విద్యార్థిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు వైద్యులు.

విద్యార్ధి మరణానికి పీఈటీ టీచర్ వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటిదాకా తమతో ఉన్న విద్యార్ధి బిల్డింగ్ పై నుంచి దూకి మరణించడంతో తోటి విద్యార్థులంతా నిర్ఘాంతపోయారు. విద్యార్ధి మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

ALSO READ | ఐటీ కంపెనీ రివర్స్ ఎటాక్ : మీ పని, జీతం తగ్గించాం.. హ్యాపీగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో గడపండి