
ప్రైవేట్ ట్యూషన్ల ముసుగులో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా ద్వారకానగర్ సమీపంలో ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ కార్యాలయంపై విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేశారు. కార్యాలయం అద్దాలు పగలకొట్టడం సహా కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి బలవంతంగా బైజూస్ కార్యాలయంలోనికి చొరబడ్డ 7-8 మంది వ్యక్తులు కాసేపు అక్కడ గందరగోళం సృష్టించారు. బైజూస్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. ఈ క్రమంల కర్రలతో దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
@ByjusSupport @BYJUS @AmitShah @aajtak @ZeeNews @PMOIndia this is video of byjus pepole and suffering from byjus harrasment me as a father of a child he has not retrun my money and employees are also suffering from byjus . pic.twitter.com/eNLhr7154T
— Babu lal Yadav (@lal_babu75179) January 4, 2024